పెదనందిపాడులో16వ శతాబ్దపు కవయిత్రి మొల్ల 585 వ జయంతి కార్యక్రమం గురువారం జరిగింది. శాలివాహన సంఘం మండల అధ్యక్షులు చల్లగిరి శ్రీనివాసరావు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా కవయిత్రి మొల్ల తెలుగులో రచించారని తొలి తెలుగు మహిళా కవయిత్రిగా మొల్ల అనేకమంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని అధ్యక్షుడు శ్రీనివాసరావు కొనియాడారు.