దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఈనెల 20 న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు పిలుపునిచ్చారు. గురువారం పెదనందిపాడు తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో జరిగిన వివిధ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో రామారావు మాట్లాడారు. కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్స్ తెచ్చిందని కార్మిక చట్టాలను పోరాడి సాధించుకోవాలన్నారు.