కాకుమాను గ్రామంలోని లూధరన్ చర్చి వద్ద ఆదివారం క్రైస్తవులు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా ర్యాలీ నిర్వహించారు. సుమారు 100 మంది క్రైస్తవులు ర్యాలీగా ప్లే కార్డ్స్ పట్టుకొని ప్రవీణ్ పగడాల ఆత్మ శాంతి జరగాలని కోరారు. కాకుమాను ఏ ఈ ఎల్ సి పాస్టర్ బి. కృపాదానం , కాకుమాను మండలంలోని అన్ని చర్చిల పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు.