గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలో కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో బుర్రి బుజ్జిబాబు గృహం దగ్ధమైంది. ఆదివారం ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ వారి కుటుంబాన్ని పరామర్శించి, అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వట్టిచెరుకూరు మండల, కోవెలమూడి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.