గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామంలో లావు వారి ఇల్లవేల్పు వీరభద్ర స్వామి ఆలయ పున ప్రతిష్ట 8వ వార్షికోత్సవ వేడుకలు గురువారం జరిగాయి. లావు వారి కుటుంబీకులు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసి అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాపయ్య శర్మ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చే వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.