గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని గ్రామానికి చెందిన వెలగా తేజు తన్మయి ఐఐటీలో 490 ర్యాంకు సాధించింది. ర్యాంకు సాధించడం పట్ల గ్రామంలోని పలువురు గ్రామ నాయకులు విద్యార్థిని దుశ్యాలువ తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెలగా రామారావు, ఉమామహేశ్వరరావు, ఎర్రం సుబ్బారావు చెన్నుపాటి శివ నాగేశ్వరరావు, నూతి పూర్ణచంద్రరావు, చీరాల పెద్దబాబు కుర్ర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.