ప్రత్తిపాడు: ఫ్యాక్టరీ సంపులో పడి కార్మికుడు మృతి

74చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం గ్రామ పరిధిలోని పోలిశెట్టి టొబాకో కంపెనీ నీటి సంపులో పడి మంగళవారం కార్మికుడు మృతి చెందాడు. రోజువారి విధులలో భాగంగా కార్మికుడు బుజ్జి హుస్సేన్ నీటిని తీసుకొచ్చేందుకు సంపు దగ్గరికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందాడు. యాజమాన్యం ఈతగాళ్లను రప్పించి మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్