జీవో నెంబర్ 77ను రద్దు చేయాలి అంటూ ప్రత్తిపాడులోని బస్ స్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రధాన యశ్వంత్ రఘువీర్ మాట్లాడుతూ కోటన్న ప్రభుత్వం రూ. 6, 400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 11న గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.