గుంటూరు జిల్లా పత్తిపాడు మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన పంపిణీ ఒకరోజు ముందే ఇవ్వడం సంతోషంగా ఉందని పింఛన్ దారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.