కాకుమాను గ్రామంలోని నన్నపనేని జడ్పీ పాఠశాలలో గురువారం భారత్ స్కౌట్స్ గైడ్ యూనిట్లను స్కౌట్స్ జిల్లా సమన్వయకర్త ఎం ఏడుకొండలు ప్రారంభించారు. కాకుమాను ఎంఈఓ కెఎఫ్ కెనడి పాల్గొని స్కౌట్స్ గైడ్స్ శిక్షణ వలన విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం పెంపొందుతాయని అన్నారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల హెచ్ఎం బి సత్యం ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.