ప్రత్తిపాడు నియోజకవర్గం, మండలం తుమ్మలపాలెం గ్రామంలో తెదేపా నేత గుంటుపల్లి రాంబాబు ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలో చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి వెళ్లలేని మహిళలకు, వృద్ధులకు, కార్యకర్తలకు, గ్రామంలోనే వీక్షించే విధంగా భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. గ్రామంలోని టిడిపి శ్రేణులు, మహిళలు, గ్రామస్తులు చంద్రబాబునాయుడు అనే నేను ప్రమాణ స్వీకారాన్ని చూసి టిడిపి శ్రేణుల్లో ఆనందం వెల్లువెత్తింది.