టెన్త్ ఫలితాలు.. గుంటూరు ర్యాంక్ ఎంతంటే..?

టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. గుంటూరులో మొత్తం 3,336 మంది పరీక్ష రాస్తే 2,579 మంది పాస్ అయ్యారు. పాస్ శాతం 77.31 కాగా, జిల్లా రాష్ట్రంలో 14వ స్థానంలో నిలిచింది. 2,053 మంది అబ్బాయిల్లో 1,541 మంది, 1,283 మంది అమ్మాయిల్లో 1,038 మంది ఉత్తీర్ణులయ్యారు. జూన్ 13–19 మధ్య రీకౌంటింగ్ (రూ.500), రీవెరిఫికేషన్ (రూ.1000)కి అప్లై చేసుకోవచ్చు.