ముట్లూరులో దొంగల బీభత్సం.. బంగారం, నగదు చోరీ

2979చూసినవారు
వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన మాదల సాంబశివరావు కుటుంబం శుక్రవారం ఊరికి వెళ్లారు. తిరిగి సోమవారం వచ్చేసరికి ఇంటి తలుపు తాళాలు తొలగించి ఉన్నాయి. ఇంట్లోని 20సవర్ల బంగారం, లక్ష రూపాయల నగదు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వినోద్ బాబు, క్లూజ్ టీం ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు.
చోరీ కేసుగా నమోదు చేస్తున్నట్లు ఎస్సై వినోద్ బాబు మీడియా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్