ప్రపంచ స్థాయి రాజధానిలో కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదా అని సీఐటీయూ రాజధాని డివిజన్ అధ్యక్షులు రవి ప్రశ్నించారు. సిఆర్డిఏ కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానిలో ప్రజల ఆరోగ్యం కోసం కార్మికుల పని చేస్తున్నారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అధికారులు పెన్ డౌన్ చేసిన విధంగా కార్మికులు చీపురు డౌన్ చేస్తే పరిస్థితి ఏంటో ఊహించుకోవాలన్నారు.