రేపల్లె డివిజన్ లో సోమవారం రాత్రి నుండి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షాలకు 22. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చెరుకుపల్లి మండలంలో 5. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా నిజాంపట్నం మండలంలో 4. 2 మిల్లీమీటర్లు, నగరం మండలంలో 5. 2 మిల్లీమీటర్లు, రేపల్లె మండలంలో 7. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని అధికారులు తెలిపారు.