నేల వాలుతున్న వరి పంట

64చూసినవారు
ఫెంగల్ తుఫాను ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రేపల్లె నియోజకవర్గం లోని పలు ప్రాంతాలలో వరి పంట నేల వాలింది. వరి పంట కోతకు వచ్చిన దశలో వర్షాలు పడటంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. వర్షాలు తగ్గు ముఖం పట్టే వరకు రైతులు ఎవరు వరి పంటను కోయవద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పంట పొలాల్లో నీరు అధికంగా ఉంటే వాటిని వెంటనే బయటికి పంపించేయాలన్నారు.

సంబంధిత పోస్ట్