రేపల్లె గ్రామ దేవతకి సారె

59చూసినవారు
పాల్గుణ పౌర్ణమి పురస్కరించుకొని రేపల్లె గ్రామ దేవత శ్రీ భూరగలమ్మ అమ్మవారికి శుక్రవారం నెల సంబరాలలో భాగంగా సారె మహోత్సవం నిర్వహించారు. ఓల్డ్ టౌన్ అంకమ్మ చెట్టు వద్ద నుండి అమ్మవారిని మేళ తాళాలతో, కాళిమాత వేషాలతో, వివిధ రకాల స్వీట్స్, పళ్ళు, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్కలతో, వడిగింటి బియ్యంతో ఊరేగింపు అత్యంత వైభవం గా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్