ఈ నెల 9 వరకు మద్యం షాపులకు దరఖాస్తుల ఆహ్వానం

85చూసినవారు
ఈ నెల 9 వరకు మద్యం షాపులకు దరఖాస్తుల ఆహ్వానం
నేటి నుండి ఈ నెల 9వ తేదీ వరకు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని రేపల్లె ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ సిఐ ఆర్. దివాకర్ తెలిపారు. మంగళవారం రేపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దరఖాస్తుదారులు ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల తొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఈనెల 11వ తేదీన కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా షాపులు నిర్ణయిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్