ఏపీ గురుకుల పాఠశాలలో 2025 -26 విద్యా సంవత్సరానికి 5, 6, 7, 8 తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. 5 వ తరగతిలో ప్రవేశానికి 80సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. 6, 7, 8 తరగతిలో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో కోరారు. ఆసక్తి గలవారు https: //aprs. ofss. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 25వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.