విద్యార్థులు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలని చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం చెరుకుపల్లి లోని ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలో ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండి చెడు మార్గం వైపు పయనించవద్దన్నారు. ఆడపిల్లలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.