వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అనుసంధానాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని చెరుకుపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి టి బాలాజీ గంగాధర్ అన్నారు. చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామంలో బుధవారం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అనుసంధానంపై ఐసీఏఆర్- ఎస్. సి సబ్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాపట్ల వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కేఎస్ఆర్ పాల్, అధికారులు పాల్గొన్నారు.