రోడ్డు ప్రమాదాలలో అధిక శాతం మరణాలు హెల్మెట్ లేకపోవడం వల్ల సంభవిస్తున్నాయని రేపల్లె డిఎస్పి ఆవల శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు సోమవారం చెరుకుపల్లిలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిఎస్పీ మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అన్నారు. హెల్మెట్ లేకుండా రహదారులపై వాహనాలు నడిపితే జరిమానా విధిస్తామని తెలిపారు.