పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. చెరుకుపల్లి మండలంలోని నాలుగు పరీక్ష కేంద్రాలలో 642 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. పరీక్షలు తొలి రోజు కావడంతో విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు పరీక్షా కేంద్రానికి వచ్చి హాల్ టికెట్లు, రూమ్ నెంబర్లు చూసుకొని చిన్నారులకు జాగ్రత్తలు చెప్పారు. పరీక్ష కేంద్రాలలో అన్ని ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ పులి లాజర్ తెలిపారు.