విశాఖ ఉక్కు పరిశ్రమలో అన్యాయంగా తొలగించిన 5400 కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధులలోకి తీసుకోవాలని సిపిఐ రేపల్లె ఏరియా కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ, సిపిఐ (ఎంఎల్) నాయకులు మర్రివాడ వెంకట్రావులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంగళవారం చెరుకుపల్లిలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బిజెపి ప్రైవేటీకరణ విధానాలకు కూటమి ప్రభుత్వం తలొగ్గి కేంద్రానికి అనుకూలంగా పనిచేస్తుందన్నారు.