చెరుకుపల్లి: అంబేద్కర్ కి నివాళులర్పించిన డాక్టర్ గణేష్

69చూసినవారు
చెరుకుపల్లి: అంబేద్కర్ కి నివాళులర్పించిన డాక్టర్ గణేష్
భారత దేశానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయంగా నిలిచిపోతుందని రేపల్లె వైసీపీ ఇన్ ఛార్జ్ డాక్టర్ ఈవూరు గణేష్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134 వ జయంతి సందర్భంగా చెరుకుపల్లి లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అసమానతలు లేని సమాజం కోసం అంబేడ్కర్ అనునిత్యం పరితపించారన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ గణేష్ పిలుపునిచ్చారు.