భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా రేపల్లె వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఆదివారం చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు.