చెరుకుపల్లి: అగ్నిప్రమాదంలో గడ్డివాము దగ్ధం

79చూసినవారు
చెరుకుపల్లి: అగ్నిప్రమాదంలో గడ్డివాము దగ్ధం
అగ్ని ప్రమాదంలో గడ్డివాము దగ్ధమైన సంఘటన చెరుకుపల్లి మండలం ఆరంబాక పంచాయతీలోని కామినేని వారి పాలెం లో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన కామినేని శ్రీనివాసరావుకు చెందిన వరిగడ్డి వాము ప్రమాదవశాత్తు కాలిపోయింది. సుమారు 18, 000 రూపాయలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. చుట్టుపక్కల వారు అప్రమత్తమై గడ్డివాము పై నీళ్లు చల్లి మంటలను ఆర్పి వేశారు.

సంబంధిత పోస్ట్