కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలకు పాల్పడుతూ ఉద్యోగులను తొలగిస్తుందని రేపల్లె వైసిపి ఇంచార్జ్ డాక్టర్ ఈవూరు గణేష్ మండిపడ్డారు. ఆదివారం గుళ్ళపల్లి లోని క్యాంపు కార్యాలయంలో కూటమి ప్రభుత్వంలో తొలగించిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గణేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులలో భాగంగా కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లను పార్టీ ముద్ర వేసి తొలగించటం దారుణమన్నారు.