కిషోరి వికాసం పై ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త అవగాహన కలిగి ఉండాలని పల్లపట్ల సిడిపిఓ ఎం. అనసూయ అన్నారు. సోమవారం చెరుకుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో షేక్ మహబూబ్ సుభాని అధ్యక్షతన అంగన్వాడి కార్యకర్తలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో మాట్లాడుతూ కిషోరి బాలికలకు విద్య, ఆరోగ్యం, పౌష్టిక ఆహారం, జీవన ప్రమాణాలు పై అవగాహన కల్పించాలన్నారు.