ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో ఎన్నారై కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఎన్నారై విద్యాసంస్థల సీఈవో సిహెచ్ ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం ఇంటర్మీడియట్ పరీక్షల్లో మండల స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను శాలువా, మెమొంటోతో సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల డీన్ శ్రీమన్నారాయణ, ప్రిన్సిపాల్ కిషోర్ కుమార్ , వైస్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.