ఈనెల 27వ తేదీన జరిగే కరెంటు చార్జీల బాదుడుపై పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రేపల్లె వైసిపి ఇన్చార్జి డాక్టర్ గణేష్ కోరారు. మంగళవారం గుళ్ళపల్లి లోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో పోరుబాట కార్యక్రమం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్ చార్జీల పేరుతో 18, 700 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేసిందన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలన్నారు.