ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. చెరుకుపల్లి మండలంలోని మూడు పరీక్ష కేంద్రాలలో 557 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. గీతం కళాశాలలో 202 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఎన్నారై కళాశాలలో 118 మంది విద్యార్థులకు గాను నలుగురు గైర్హాజరయ్యారు. కావూరు కళాశాలలో 237 మంది విద్యార్థులకు గాను ఆరుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు.