రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, వైసిపి బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. గురువారం చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో కల్లాలలో ఆరబోసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. మద్దతు ధరకి దాన్యం కొనుగోలు చేస్తున్నారా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రేపల్లె వైసిపి ఇంచార్జ్ డాక్టర్ గణేష్, చిమట బాలాజీ, యార్లగడ్డ మదన్మోహన్, బొర్రా శ్రీనివాసరావు పాల్గొన్నారు.