చెరుకుపల్లి మండలం ఆరేపల్లి పంచాయతీ పరిధిలోని ఉచా వారిపాలెం గ్రామ దేవత శ్రీ గోపయ్య స్వామి సమేత తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు మొగలిపువ్వు వీరస్వామి ఆధ్వర్యంలో అమ్మవారు తిరునాళ్లు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పొంగళ్ళు సారే పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు.