గ్రామాలలో తిరునాళ్లను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని డీఎస్పీ ఆవల శ్రీనివాసరావు తెలిపారు. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఉత్తర్వులు మేరకు రేపల్లె రూరల్ సీఐ, చెరుకుపల్లి ఎస్సై లతో కలిసి శనివారం రాత్రి చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రజలు ఏవైనా ఉత్సవాలు, జాతరలు ఉన్నట్లయితే ఎలాంటి గొడవలు పడకుండా, ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలన్నారు.