చెరుకుపల్లి మండలం కావూరు గ్రామం నుండి రాంభోట్లపాలెం జాతీయ రహదారిలో విద్యుత్ స్తంభాలకు చెట్ల తీగలు ప్రమాదకరంగా అల్లుకున్నాయి. చెరుకుపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలో ఈ విధంగా ఉన్నాయి. అటువైపు వెళితే ప్రమాదవశాత్తు చేయి తగిలి విద్యుత్ ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు అని స్థానికులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు స్పందించి ఇప్పటికైనా చెట్ల తీగాలను తొలగించాలని కోరుతున్నారు.