స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ పై చెరుకుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షేక్ మహబూబ్ సుభాని మాట్లాడుతూ అభివృద్ధికి కావలసిన లక్షణాలు నిర్ధారణ చేసుకుని దానిని గ్రామీణ ప్రాంతాలలో ఎలా అమలు చేయాలనే విషయాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈవోపీఆర్డి శ్రీనివాస్, సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు పాల్గొన్నారు.