పౌష్టికార పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా శిశువు మానసిక, భావోద్వేగ ప్రేరణ గురించి సీడీపీఓ సుచిత్ర వివరించారు. నగరం సెక్టార్ పరిధిలోని పెద్దవరం అంగన్వాడీ కేంద్రం నందు గర్భవతులు, బాలింతలు, రెండు సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పౌష్టికాహార ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజరు మంజుల, సునీత అంగన్వాడీ కార్యకర్తల పాల్గొన్నారు.