భారత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్ పాయ్ జన్మదిన వేడుకలు బుధవారం మండల కేంద్రమైన బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు. బిజెపి నాయకుడు, రేపల్లె అసెంబ్లీ కన్వీనర్ మాణిక్యరావు వాజ్ పేయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో నగరం మండల బిజేపి ప్రధాన కార్యదర్శి భయ్యన వెంకటరావు, బీజేపీ నాయకులు శాంతి స్వరూప్, మత్తి శేషు బాబు, బొలిశెట్టి ప్రసాద్, మణికంట తదితరులు పాల్గొన్నారు.