చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఎస్పి శ్రీనివాసరావు

80చూసినవారు
వార్షిక తనిఖీలలో భాగంగా ఆదివారం చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ ను రేపల్లె డిఎస్పి ఆవల శ్రీనివాసరావు తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించి సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ లో సిబ్బంది పనితీరు, రికార్డులు నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. రేపల్లె గ్రామీణ సీఐ సురేష్ బాబు, చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్