నగరం మండలం పూడివాడలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. చెత్త తగలబెట్టే క్రమంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కరేటి వెంకటేశ్వర్లు కు చెందిన పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ఎవరు ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.