అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా బుధవారం రేపల్లెలో అగ్నిప్రమాదం జరిగేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. రేపల్లె పట్టణంలోని సూర్య టవర్స్ అపార్ట్మెంట్ నందు రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలు సంబంధించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి డెమో ద్వారా వివరించారు. ఈనెల 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తామని అగ్నిమాపక శాఖ అధికారి సాంబశివరావు తెలిపారు.