చెరుకుపల్లి మండలంలో కౌలు రైతు కార్డులపై గ్రామసభలు

85చూసినవారు
చెరుకుపల్లి మండలంలో కౌలు రైతు కార్డులపై గ్రామసభలు
కౌలు రైతులందరూ తప్పనిసరిగా సిసిఆర్సి కార్డులను తీసుకోవాలని చెరుకుపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ గంగాధర్ తెలిపారు. చెరుకుపల్లి మండలంలోని గూడవల్లి, రాజోలు గ్రామాలలో గురువారం కౌలు రైతు కార్డులపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో బాలాజీ గంగాధర్ మాట్లాడుతూ కౌలు రైతు కార్డులు తీసుకోవడం వల్ల ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామా విఆర్వోలు, వీఐఏలు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్