నగరం మండలం చిన్నమట్లపూడి పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా మురుగు కాలవలో ఉన్న మట్టిని తవ్వుతున్నారు. కాలువలలో సుమారు 2000 ట్రక్కులు మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నప్పటికీ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. మట్టి మాఫియా చేస్తున్న అక్రమ త్రవ్వకాలపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని జై భీమ్ రావ్ భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రె కోటయ్య తెలిపారు.