అనగానికి మంత్రి పదవి పట్ల హర్షం

77చూసినవారు
అనగానికి మంత్రి పదవి పట్ల హర్షం
రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. చెరుకుపల్లి మండలం మెట్టగౌడ పాలెం గ్రామంలో టిడిపి నాయకుడు పేరం శంకర్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. హ్యాట్రిక్ విజయం సాధించిన అనగాని సత్యప్రసాద్ కు మంత్రి పదవి కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్