గుళ్లపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు

80చూసినవారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా సోమవారం గుళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ ధనలక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన, లింగ వివక్షత, చదువు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవిత మాట్లాడుతూ ఆడపిల్లలకు 18 సం. లు, మగ పిల్లలకు 21 సం. లు నిండకుండా వివాహం చేస్తే సామాజికంగా, శారీరకంగా, ఆరోగ్యకరమైన ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్