కొల్లూరు మండలం బోద్దులూరుపాడు అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలను అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమృతలూరు ప్రాజెక్టు అధికారిని గన్నవరపు విజయలక్ష్మి పాల్గొని సంక్రాంతి సంబరాలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో బాల బాలికలు ప్రత్యేక వేషధారణలతో సంబరాల్లో పాల్గొన్నారు.