కార్మికులకు హాని చేసే లేబర్ కోడ్ లను రద్దుచేసి కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్ కోరారు. దేశవ్యాప్తంగా కార్మికుల డిమాండ్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం చెరుకుపల్లి తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తాసిల్దార్ బ్రహ్మయ్య కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మణిలాల్ మాట్లాడుతూ లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.