మట్టల ఆదివారాన్ని చెరుకుపల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏసుక్రీస్తు శిలువకు వెళ్లే ముందు జెరుసలెం నగరంలో తాటి కొమ్మలతో సన్మానంగా ప్రవేశించిన రోజును క్రైస్తవ సోదరులు మట్టల ఆదివారంగా జరుపుకుంటారని ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చ్ బిషప్ రెవరెండ్ డాక్టర్ కూరాకుల రత్నమోహన్ తెలిపారు. మహిళలు, చిన్నారులు ఈత కొమ్మలకు పూలు గుచ్చి చెరుకుపల్లి గుళ్ళపల్లి గ్రామాలలో ఈత మట్టలతో ప్రదర్శన నిర్వహించారు.