నిజాంపట్నం: 100 లీ. బెల్లం ఊట ధ్వంసం

79చూసినవారు
నిజాంపట్నం: 100 లీ. బెల్లం ఊట ధ్వంసం
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు నగరం ఎక్సైజ్ సీఐ శ్రీరాంప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం నిజాంపట్నం మండలంలో దాడులు నిర్వహించారు. దిండి పంచాయతీ పరిధిలోని జంపని వారి పాలెం గ్రామంలోని పంట పొలాలలో నాటు సారా తయారు చేస్తున్నారని సమాచారంతో దాడులు చేసి100 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. అదే ప్రాంతంలో 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ శ్రీరామ్ ప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్